ఐతే దీని వెనక పెద్ద ప్లాన్ ఉందని చెప్పుకుంటున్నారు. నందమూరి మూడవ తరం వారసుడు ఎంట్రీ ఆ ఫ్యామిలీ లెగసీని కొనసాగించే బాధ్యత మోక్షజ్ఞ మీద ఉంది. ఐతే అతని తొలి సినిమా ఎవరు చేశారన్న టాక్ వచ్చినప్పుడు ఆ ఛాన్స్ ఎవరికో ఇవ్వడం కన్నా అదే సినిమాతో బాలయ్య కూతురు నిర్మాతగా మారిందని చెబితే అది రికార్డుల్లో నిలిచిపోతుంది. అందుకే తేజశ్విని ఈ సినిమాతో నిర్మాతగా మారాలని అనుకుంటున్నారని తెలుస్తుంది.
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో కూడా ఒక అద్భుతమైన కథతో పాన్ ఇండియా రిలీజ్ చేసేలా సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఐతే అది నేషనల్ వైడ్ రిలీజ్ ఉంటుందా లేదా అన్నది మాత్రం కొన్నాళ్లకు తెలుస్తుంది. ఐతే మొన్నటిదాకా మోక్షజ్ఞ లుక్స్ గురించి రకరకాలుగా మాట్లాడిన వారంతా కూడా ఇప్పుడు మోక్షజ్ఞ లుక్ చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు. తప్పకుండా ప్రశంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ చేసే సినిమా నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు మోక్షజ్ఞ సినిమాను కూడా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. మోక్షజ్ఞ తొలి సినిమాపై ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్ లో జోష్ మొదలైంది.