యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా బ్యాలన్స్ షూటింగ్ ను ముగించేందుకు టీం వారు రెడీ అయ్యారు.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ ల డ్యూయెట్‌ సాంగ్ చిత్రీకరణ జరుపుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.తాజాగా ఆ పాటకు సంబంధించి పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి X లో చేసిన ఆసక్తికర పోస్ట్ అంచనాలు పెంచాయి. దేవర మూవీ నుంచి వచ్చిన మొదటి పాట ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక ఆ పాట తర్వాత రాబోతున్న పాట కూడా అంతకు మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.పోస్ట్ లో వెయిట్‌ చేసినందుకు తగిన ఫలితం ఉంటుంది అంటూ రామ జోగయ్య శాస్త్రి ప్రకటించాడు. ఆయన X లో... తంగం అంతరంగం హాయిగా ఉయ్యాల ఊగుతున్నట్లు ఉంటుంది ఇప్పుడే విన్నా అతి త్వరలోనే సాంగ్‌ వచ్చేస్తుంది అంటూ పోస్ట్ చేశాడు.దేవర మూవీలో జాన్వీ కపూర్‌ పోషిస్తున్న పాత్ర పేరు తంగం అనే విషయం తెల్సిందే. 


ఆమె పేరు మీద ఈ పాట ఉంటుందని రామ జోగయ్య శాస్త్రి పోస్ట్ తో క్లారిటీ వచ్చింది. ఈ పాట లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ లు రొమాంటిక్ డాన్స్‌ తో అదరగొట్టబోతున్నారు అంటూ మేకర్స్ నుంచి సమాచారం తెలుస్తుంది.ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్  లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో పాటు, ఇంకా జాన్వీ కపూర్‌ మొదటి సారి తెలుగు లో నటిస్తున్న సినిమా ఇదే అవ్వడం వల్ల అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే నమ్మకంను దేవర మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.పాన్ ఇండియా రేంజ్‌ లో విడుదల అవ్వబోతున్న దేవర సినిమాలో బాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సెప్టెంబర్‌ నెల చివరి వారంలో ఈ సినిమా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇక దేవర సినిమాకి సీక్వెల్‌ కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దేవర సినిమా హిట్‌ అయితే వెంటనే దేవర 2 సినిమాను కూడా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: