మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి న‌టించిన లేటెస్ట్ మూవీ ‘మ‌హారాజ’ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమా సేతుప‌తి కెరీర్ లో 50వ చిత్రంగా రావ‌డం.. దీనికి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ ల‌భించ‌డంతో ‘మ‌హారాజ’ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాను పూర్తి క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ద‌ర్శ‌కుడు నిధిల‌న్ స్వామినాథ‌న్ తెర‌కెక్కించిన తీరు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.అయితే, ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ వ‌ర్గాల్లో ఓ టాక్ జోరుగా వినిపిస్తోంది. రీమేక్ చిత్రాల‌కు కేరాఫ్ గా నిలిచే బాలీవుడ్ లో ‘మ‌హారాజ’ మూవీ రీమేక్ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డ కొంద‌రు మేక‌ర్స్ ఈ సినిమాను రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ మ‌ధ్య‌కాలంలో బాలీవుడ్ లో రీమేక్ చిత్రాలు వ‌రుస‌గా ఫెయిల్ అవుతున్నాయి.

జెర్సీ, ల‌క్ష్మీ, షెహ‌జాదా, భోళా వంటి సినిమాలు బాలీవుడ్ లో దారుణ‌మైన ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. దీంతో మ‌ళ్లీ ఇప్పుడు సౌత్ సినిమాను రీమేక్ చేస్తే, ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో అని అక్క‌డి సినీ స‌ర్కిల్స్ లో చ‌ర్చించుకుంటున్నారు. అయితే, ‘మ‌హారాజ’ సినిమాలోని క‌థ రొటీన్ అయినా కూడా ఈ మూవీ స్క్రీన్ ప్లే కార‌ణంగా ఇక్క‌డి ఆడియెన్స్ కు ఇది తెగ న‌చ్చేసింది. కానీ, బాలీవుడ్ లో ఇంతే ఎంగేజింగ్ గా ఈ సినిమాను తీసే డైరెక్ట‌ర్ ఎవ‌రున్నారు అనే ప్ర‌శ్న వినిపిస్తోంది. మ‌రి ‘మ‌హారాజ’ రీమేక్ తో బాలీవుడ్ మ‌రోసారి త‌ప్పు చేస్తుందా.. లేక ఈ సినిమా రీమేక్ అంశాన్ని వ‌దిలేస్తుందా అనేది చూడాలి.కేవలం రూ.20 కోట్లతో రూపొందించిన మహారాజ తమిళనాడు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సేతుపతి కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా మహారాజా నిలిచింది. తెలుగులోను ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్‌ మలిచిన తీరు సూపర్ అనే చెప్పాలి. ఇప్పుడు మహారాజ బాలీవుడ్ వెళ్లనున్నాడని సమాచారం. విభిన్న కథలను ఎంచుకొని సూపర్ హిట్ లు సాధించిన స్టార్ హీరో అమిర్ ఖాన్ మహారాజ హిందీ రైట్స్ కొనుగోలు చేసారు. అమిర్ గత చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ఎన్నో అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచింది. మరి మహారాజని యధావిధిగా రీమేక్ చేస్తారా లేదా మార్పులు చేర్పులు చేస్తారా అన్నది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: