గోవిందుడు అందరివాడేలే రామ్ చరణ్ చెల్లెలు.. ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూశారా? 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరివాడేలే సినిమా కూడా ఒకటి.సీనియర్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలి పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా.? ఇంతకి ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఇక ఆ బ్యూటీ పేరు అయేషా కాదుస్కర్. ఆమె గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించింది కేవలం కొంతసేపు అయినా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది ఈ చిన్నది. అయితే చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలానే ఉంటుంది ఈ అమ్మడు ముంబై కి చెందని నటి అట. 


2012లో వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ సినిమాలో కూడా నటించింది అయేషా.. ఆతర్వాత 2014లో టాలీవుడ్ లో గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించి యూత్ ని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు ఈ చిన్నది. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ హాట్ బ్యూటీ. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ బాగా యాక్టివ్ గా ఉంటుంది. రోజు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది అయేషా. ఈ క్రమంలోనే ఈ హాట్ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. నెటిజన్స్ సో హాట్ నువ్వు టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తే పక్కా స్టార్ హీరోయిన్ అవుతావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి అయేషా ఎంట్రీ ఇస్తుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: