తెలుగు సినీ పరిశ్రమంలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , నందమూరి నటసింహం బాలకృష్ణ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్నారు. ఇక వీరు ప్రస్తుతం ఏ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం అన్నపూర్ణ స్టూడియోలో త్రిష కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో చరణ్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో శ్రీకాంత్ మరియు కొంత మంది నటులపై ఈ మూవీ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రాజస్థాన్ లో బాలకృష్ణ మరియు ఈ సినిమాలో హీరోయిన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు శంషాబాద్ లో ఎన్టీఆర్ పై ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: