ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఈమధ్యనే మొదలైంది. సక్సెస్ ఫుల్ గా రెండుస్ ఈజన్లు పూర్తి చేసుకున్న ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3 ని ఈమధ్యనే గ్రాండ్ గా మొదలు పెట్టింది. జడ్జులుగా కార్తిక్, థమన్, గీతా మాధురి కొనసాగుతున్న ఈ సింగింగ్ షోకి సెలబ్రిటీస్ తాకిడి ఎక్కువైంది. షోని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఆహా మెగా ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3కి ఈమధ్యనే విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు. రౌడీ బోయ్ రావడంతో షో మీద మరింత ఆసక్తి పెరిగింది.

ఇక ఇప్పుడు నేషనల్ క్రస్ రష్మిక ఆ షోకి అటెండ్ అయ్యింది. అదేంటో విజయ్ వచ్చిన తర్వాత వెంటనే రష్మిక షోకి రావడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇద్దరు ఇలా కలిసి ఒకే షోకి ఒకరి వెంట ఒకరు రావడం కూడా యాదృశ్చికంగా లేదా కావాలని చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. నేషనల్ క్రష్ రష్మిక ఇండియన్ ఐడల్ సీజన్ 3 తెలుగుకి వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆహా ఓటీటీ వారే తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫోటోలు లీక్ చేశారు. ఆగష్టు 15, 16 తేదీల్లో ఈ ఎపిసోడ్ రాబోతుందని తెలుస్తుంది. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే యానిమల్ తో బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న రష్మిక త్వరలో పుష్ప 2, కుబేర సినిమాలతో రాబోతుంది. వీటితో పాటుగా ది గర్ల్ ఫ్రెండ్ అనే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో కూడా రష్మిక నటిస్తుంది. రష్మిక ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3 కి వచ్చిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ షోలో పాల్గొన్న రష్మిక ని చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: