స్టార్ హీరోయిన్ కృతి స‌న‌న్‌..వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కృతి సనన్ తాజాగా సిగిరెట్ తాగుతూ కనిపించింది.అంతే ఇప్పుడు అంత ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు లో ఫస్ట్ మూవీ నే సూపర్ స్టార్ మహేష్ పక్కన జోడి కట్టి ఆకట్టుకున్న ఈ భామ..ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ సినిమాలో అలరించింది. కానీ, ఈ రెండు సినిమల్లో కృతి నటనకు మంచి మార్కులు పడినా.. సినిమాలు సక్సెస్ కాకపోవడం తో అమ్మడికి అవకాశాలు తలుపుతట్టలేదు. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. ఇక అక్కడే బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఎదిగింది. ఈ మధ్యనే ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.జులై 27 న ఈ భామ పుట్టిన రోజు..ఈ సందర్బంగా బర్త్ డే వేడుకలు గ్రీస్ లో చేసుకుంది. అయితే అక్కడ ఈ భామ కు సంబదించిన వీడియో బయటకు వచ్చింది. ఇక ఆ వీడియో చివర్లో ఓ యువతి సిగరెట్ తాగుతూ కనిపిస్తుంది. అయితే ఆ వీడియోలో యువతి ముఖం సరిగ్గా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది కృతిసనన్ అని నెట్టింట అందరూ విమర్శిస్తున్నారు. కాగా, ఆ వీడియోను ఓ రెడిట్ యూజర్ పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి నిజంగా కృతి సిగిరెట్ తగ్గిందో లేదో ఆమెనే క్లారిటీ ఇవ్వాలి.ఈ క్ర‌మంలో గతంలో కృతి స‌న‌న్‌ తల్లి షేర్ చేసిన ఓ పోస్ట్ షేర్ చేస్తూ నెటిజ‌న్స్ ఆమెను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కృతి సనన్‌ సిగరెట్ తాగడం కాదు కదా.. ఆమెకు అవాసన కూడా పడదు.. తన చుట్టూరు ఎవరైనా స్మోకింగ్ చేసినా కూడా వారితోను వాదిస్తుంది అనే సారాంశం వచ్చేలా ఓ పోస్ట్ షేర్ చేసింది.

 ప్రస్తుతం సిగరెట్ తాగుతూ అమ్మ‌డు అడ్డంగా దొరికిపోవడంతో తన తల్లిని ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ట్రోల‌ర్స్‌.అయితే ఇండియాలో పబ్లిక్ ప్లేస్ లలో తమ ఇమేజ్ ను కాపాడుకోవడం కోసం ఇలాంటి వాటికి దూరంగా ఉండే వీళ్లు.. బయటి దేశాల్లో మాత్రం విచ్చలవిడిగా ఇలా చేసేస్తుంటారని ఓ యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.వాళ్లూ మనుషులే.. వాళ్ల బతుకేలేవో వాళ్లను బతకనీయండి.. ప్రైవసీతో బతకడానికి వాళ్లు చంద్రుడిపైకి వెళ్లాలా అని మరో యూజర్ ఆమెకు మద్దతుగా కామెంట్ చేశారు. గతంలో ఆమె నటించిన బరేలీ కీ బర్ఫీ మూవీలో తనకు సిగరెట్ కాల్చే అలవాటు లేకపోయినా.. సినిమా కోసం చేయాల్సి వచ్చిందని కృతి చెప్పిన వీడియోను కూడా కొందరు వైరల్ చేస్తున్నారు.అయితే కొంతమంది మాత్రం ఆ వీడియో అంతగా స్పష్టంగా కనిపించడం లేదని.. ఆమె అసలు కృతి సన్నన్ కాదు అంటూ.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్కడ స్మోక్ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ.. ఆమె సిగరెట్ తాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపించడం లేదని.. ఇలా అర్థంపర్థం లేకుండా నెగటివ్ ట్రోల్స్ చేయడంలో అసలు ఉపయోగం ఏముంది అంటూ ట్రేలర్స్ పై ఫైర్ అవుతున్నారు కృతి సనన్‌ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: