హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులలో దీపికా పదుకొనే ఒకరు. ఈమె ఇప్పటికే తన కెరీర్ ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. కెరియర్ ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ఈమె స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఈ నటి తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది.

జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా ద్వారా దీపికా కు తెలుగు లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే బాలీవుడ్ స్టార్ నటుడు అయినటువంటి రన్వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతోంది. ఒక వైపు రన్వీర్ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉంటే దీపిక ఆయనకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాలు చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే హీరోగా రన్వీర్ సింగ్ ఏ స్థాయిలో పారితోషకాన్ని తీసుకుంటూ టాప్ లో నిలుస్తున్నాడో ... నటి మనులలో దీపికా పదుకొనే కూడా అందుకు ఏ మాత్రం తీసుకోవడం లేదు. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 15 నుండి 20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు , అతిథి పాత్రల కోసం 5 నుండి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: