హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ దక్కించుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జ. అంతకుముందు ‘జాంబీ రెడ్డి’తో ఆయన మంచి హిట్ అందుకున్నారు. ‘అద్భుతం’, ‘ఓ బేబీ’ లాంటి చిత్రాలతో యూత్ ఆడియెన్స్లో క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’తో తేజ నెక్స్ట్ రేంజ్కు చేరుకున్నారు. టాలీవుడ్తో పాటు శాండల్వుడ్, బాలీవుడ్లో ఈ ఫిల్మ్ సంచలన వసూళ్లు సాధించి పాన్ ఇండియా హిట్గా నిలిచింది. దీంతో తేజ నటించే తదుపరి సినిమాలపై అందరి దృష్టి నెలకొంది. అయితే చాలా ఆఫర్లు తలుపు తట్టినా సెలెక్టివ్గా వ్యవహరించిన యంగ్ హీరో ‘మిరాయ్’కు ఓకే చెప్పారు. ఇప్పుడీ చిత్రం షూటింగ్ దశలో ఉంది.ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ బరిలో మినిమమ్ మూడు నాలుగు వారాలు జోష్ ఉంటుంది. అందులోనూ 'సలార్', 'కల్కి 2898 ఏడీ' తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కనుక 'రాజా సాబ్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్ విడుదలైన తర్వాత ఆ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో 'రాజా సాబ్' విడుదలైన వారం తర్వాత 'మిరాయ్' థియేటర్లలోకి వస్తుందా? వచ్చే సాహసం చేస్తుందా? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్.ఒక బడా హీరో సినిమా రిలీజ్ డేట్ వచ్చిందంటే.. అప్పటికే ఆ డేట్ పై కర్చీఫ్ వేసిన చిన్న, మీడియం రేంజ్ హీరోల సినిమాలు ముందుకో వెనక్కో వెళ్లడం సహజం. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  దెబ్బకి యంగ్ హీరో తేజ సజ్జా  సినిమా వాయిదా పడేలా ఉంది. పైగా ఈ రెండు సినిమాలకు ఒక్కరే నిర్మాత కావడం విశేషం.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రాజా సాబ్'. పీపుల్ మీడియా నిర్మాణం ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయగా తాజాగా విడుదలైంది. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో రూపొందించిన మరో 'మిరాయ్'  కూడా వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల చేయనున్న సందర్భంగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 10న 'రాజా సాబ్' విడుదల చేయడాన్ని ప్రకటించడం చూస్తుంటే.. 'మిరాయ్' విడుదల తేదీ మారడం ఖాయమనిపిస్తోంది.‘హనుమాన్’తో వచ్చిన స్టార్డమ్, క్రేజ్ను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న యంగ్ హీరోకు ఇది నెగెటివ్గా మారే ప్రమాదం ఉంది. అయితే ప్రభాస్ తలచుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ రెండు సినిమాలను నిర్మిస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే. కాబట్టి ప్రభాస్ను ఒప్పించి ‘రాజా సాబ్’ను ఇంకాస్త వెనక్కి లేదా ముందుకు జరిగేలా చూస్తే తేజ ఈ సమస్య నుంచి బయటపడతాడని చెబుతున్నారు. ప్రభాస్ ఫిల్మ్ ఎప్పుడు వచ్చినా థియేటర్ల దగ్గర పండగే. కాబట్టి తేజకు ఉన్న రిస్క్ను దృష్టిలో పెట్టుకొని ఆయన పాజిటివ్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: