బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు యావరేజ్ అయినా కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సైతం కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది. దీంతో వారిద్దరు కూడా పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. వారి తరువాతి సినిమాలు సైతం పాన్ ఇండియా తరహాలో రూపొందుతున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప దేశంలోని సినీ ప్రియులను ఓ ఊపు ఊపింది. దిగ్గజ రాజకీయ నేతలు సైతం పుష్ప డైలాగ్‌లను తమ ప్రచారంలో వాడారు. అంతగా పుష్ప డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ప్రభాస్, తారక్, చరణ్ ముగ్గురూ రాజమౌళి సినిమాల ద్వారా పాన్ ఇండియా స్టార్లుగా మారారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. తమ హీరో ఇండివిడ్యువల్‌గా పైకి వచ్చాడని, రాజమౌళి సినిమాలో నటించకపోయినా పాన్ ఇండియా స్టార్ అయ్యాడని వారు చెబుతున్నారు. కాబట్టి అల్లు అర్జున్ మాత్రమే అసలైన పాన్ ఇండియా స్టార్‌గా అభివర్ణిస్తున్నారు. దీనికి మిగిలిన హీరోల ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. పుష్ప సినిమా దేశవ్యాప్తంగా కేవలం రూ.300ల కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. కనీసం రూ.500ల కోట్లు కూడా దాటలేదని చెబుతున్నారు. ఇలా టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో డైలాగ్ వార్ జరుగుతోంది.