ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హాట్ హీరోయిన్ కియారా అద్వాణీకి సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ఫగ్లీ అనే మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా ధోని బయోపిక్ MS ధోని ది అన్ టోల్డ్ సినిమాతో లైట్ లోకి వచ్చింది కియారా. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ నేను మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అటు హిందీ.. ఇటు తెలుగులో బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. మ్యారేజ్ అయ్యాక వచ్చిన అవకాశాలు అన్నీ అందుకుని వరుస ప్రాజెక్టులపై సైన్ చేస్తోంది కియారా.ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2లో నటిస్తోంది. ఇక సౌత్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో యాక్ట్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సలార్ సీక్వెల్ లో నటించనుందని సమాచారం తెలుస్తుంది. స్పెషల్ సాంగ్ తోపాటు కీలక పాత్రలో కూడా కనిపించనుందని సమాచారం వినిపిస్తోంది.అయితే నేడు కియారా బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.అదే సమయంలో గేమ్ ఛేంజర్ మేకర్స్.. కియారాకు పుట్టినరోజు విషెస్ తెలిపుతూ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
అయితే ఆ పోస్టర్ లో శంకర్ మార్క్ క్లారిటీగా కనిపిస్తుందనే చెప్పాలి. కియారా నడుము అందాలు చూపిస్తూ చాలా హాట్ గా కనిపిస్తుంది.క్రేజీ లెహంగా వేసుకున్న కియారా చాలా అందంగా కనిపిస్తున్న డ్రెస్సింగ్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ లోని విజువల్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ నుంచి రిలీజ్ అయిన జరగండి సాంగ్ లోని స్టిల్ నే మేకర్స్ విడుదల చేశారు. చూస్తుంటే ఈ సినిమాలో కియారా అందాల ఆరబోత మాములుగా ఉండదేమో అని తెలుస్తుంది. సాధారణంగా కియారా ఇలా అందాలు చూపించడం చాలా రేర్. ఈమధ్య బాలీవుడ్ లో హాట్ ఎక్సపోసింగ్ స్టార్ట్ చేసిన కియారా ఇప్పుడు గేమ్ చేంజర్ లో మరోసారి ఎక్సపోసింగ్ చెయ్యడానికి సిద్ధం అవుతుంది. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా కొన్ని రోజుల క్రితమే మేకర్స్ రిలీజ్ చేసిన జరగండి పాట.. ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: