బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రామాయణం సినిమా తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాముడిగా రణబీర్ కపూర్-సీతగా సాయిపల్లివి నటిస్తోన్న ఈ మూవీని దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని మూవీస్ తెరకెక్కాయి. కానీ ఈ రామాయణం కోసం మాత్రం ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సీత-రాముడి పాత్రలకు ఎంపికైన నటులు పక్కాగా ఆ పాత్రలకు సూటవ్వడంతో ఈ సినిమాకి తొలి పాజిటివిటి వస్తుంది.సహజ నటనలో రణబీర్..సాయిపల్లవి ఒకరికొకరు పోటీ పడి నటిచగలరు. ఇద్దరు వైవిథ్యమైన పాత్రల్లో ఒదిగిపోయే నటులు. దీంతో సీత-రామ పాత్రలకు ఇద్దరు వందశాతం న్యాయం చేస్తారనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం 12 భారీ సెట్లు నిర్మిస్తున్నారు. రామాయణంలో కీలకమైన అయోధ్య, మిథిలా నగరాలను తలపించేలా అత్యద్బుతంగా ఇవి నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆది పురుష్ మేకర్స్ మొత్తం గ్రాఫిక్స్ పైనే డిపెండ్ అయ్యి సినిమాని అల్లకల్లోలం చేసేశారు. ఎంతో అందమైన రావణ లంక నగరాన్ని స్మశానం లా చేశారు. 


కానీ నితీష్ తెరకెక్కించే ఈ రామాయణంలో గ్రాఫిక్స్ తో పాటు మంచిగా అందమైన సెట్లు వేసి షూటింగ్ చెయ్యడం మంచి విషయంగా చెప్పవచ్చు. నితీష్ తివారి చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.రెండు భాగాలుగా ఈ మూవీని తెరకెక్కించడంతో రెండవ భాగం షూటింగ్ కూడా చేసుకునేలా సెట్ల నిర్మాణం జరుగుతోందిట.ఈ సినిమా సెట్ల కోసం వాడే మెటీరియల్ అంతా ఖరీదైనదిగా చెబుతున్నారు. బాహుబలి సినిమా కూడా ఎక్కువగా సెట్ల పైనే ఆధారపడి తీశారు. ఇలాంటి సెట్లలో షూటింగ్ చేసిన సన్నివేశాలు 3డీ పార్మెట్ లో థియేటర్లో చాలా అందంగా..అద్భుతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులకు  విజువల్ గా గొప్ప అనుభూతి పొందుతారు.ఈ సినిమాలో రావణుడి పాత్రలో యశ్ నటిస్తుండగా, సన్ని డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీని అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఏది ఏమైనా మనకున్న బడ్జెట్ లో హాలీవుడ్ వాళ్ళ లాగా మోషన్ కాప్చర్ టెక్నాలజీ వాడకుండా ఇలా మంచి మంచి లొకేషన్లలో సెట్లు వేసి షూటింగ్ జరుపుకుంటూ పక్కా ప్లాన్ తో ముందుకి వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: