టాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ శ్రీరెడ్డి.. ఈ పేరుకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతితక్కువ సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ సినిమాలకంటే వివాదాలతో ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది.వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌ అంటే శ్రీరెడ్డి పేరే వినిపిస్తుంది. ఏదో ఒక అంశంపై వివాదాన్ని లేవనెత్తడం, దానిపై ఎవరో ఒకరు కామెంట్‌ చేయడం, దానికి శ్రీరెడ్డి కౌంటర్‌ వేయడం..నిత్యం సోషల్ మీడియాలో ప్రముఖ సెలబ్రిటీలపై, రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తుంటుంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. ఈమె మొదట్లో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత అవకాశాలు రాకపోవడంతో దర్శక, నిర్మాతలపైనే విమర్శలు గుప్పించింది. ఈ భామ సోషల్ మీడియా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి తరచూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. గతంలో మానసికంగా, శారీరకంగా ఎంతో మంది తనను వేధిస్తున్నారని, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్నింటికి మించి హైదరాబాదులో జూబ్లీహిల్స్‌లోని ఫిలీం ఛాంబర్ కార్యాలయం వద్ద శ్రీరెడ్డి బట్టలు విప్పి నిరసన చేసి మరింత రచ్చ చేసింది.ఈ అమ్మడు ఎప్పటికప్పుడు రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. పలు ట్రోల్స్‌ ఎదుర్కొంటూ ఉంటుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కి వీరాభిమానిగా తనను తాను చెప్పుకుంటూ తిరిగే శ్రీరెడ్డి.. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అసభ్య పదజాలంతో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయింది.

ఈ క్రమంలో ఆమెపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు కేసు నమోదు చేశారు.అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే . ఇన్నాళ్లు తాను వైసీపీ పార్టీ అని, జగనన్న కోసం అని చెప్పుకొని తిరిగిన శ్రీరెడ్డిని ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదట. అది కాక ఇటీవల శ్రీరెడ్డి పై ఓ తెలుగుదేశం కార్యకర్త కేసు పెట్టాడు. ఇన్నాళ్లు శ్రీరెడ్డి ఇష్టమొచ్చినట్టు వాగాడంతో ఇప్పుడు టీడీపీ జనసేన కార్యకర్తలు ఆమెని టార్గెట్ చేసారు. దీంతో నాకు చచ్చిపోవాలని ఉంది అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హడావిడి చేస్తుంది.శ్రీరెడ్డి తన పోస్ట్ లో.. మెంటల్ గా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఎప్పుడు నార్మల్ అవుతానో తెలీదు. ఆ భద్రకాళే నన్ను కాపాడాలి. నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. మీడియా, టీడీపీ, జనసేన నన్ను టార్గెట్ చేసారు. నా సొంత పార్టీ వైసీపీ కూడా నన్ను పట్టించుకోవట్లేదు. నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు అంటూ పోస్ట్ చేసింది. దీంతో శ్రీరెడ్డి పోస్ట్ వైరల్ అవ్వగా అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఇలా డ్రామాలు ఆడుతుందని పలువురు కామెంట్స్ చేస్తుంటే కొంతమంది వైసీపీ వాళ్ళు మాత్రం ధైర్యంగా ఉండండి, మీకు మేమున్నాం అంటూ కామెంట్స్ చేస్తారు. మొత్తానికి ఇన్ని రోజులు ఇష్టమొచ్చినట్టు ఎగిరిన శ్రీరెడ్డి ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతుంది.ఇక ఇప్పటికే ఈ పోస్ట్ చూసిన చాలామంది శ్రీ రెడ్డి ఏదో టైమ్ పాస్ కి ఇలాంటి పోస్ట్ లు పెడుతుంది తప్ప నిజంగా ఆమెకు చనిపోయేంత ధైర్యం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మరి కొంతమంది మాత్రం వాళ్ల ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు ఏదో ఒక టైమ్ పాస్ వీడియోలు చేస్తూ ఉండేది. ఇక ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారం లో లేదు కాబట్టి ఎవరినో ఒకరిని బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తుందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు... ఇక మరి కొంతమంది మాత్రం ఎన్డీయే కూటమి తనను ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తుందేమో అనే ఉద్దేశ్యంతో ముందుగానే ఆమె ఇలాంటి పోస్ట్ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఎన్నికలకు ముందు శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా సపోర్ట్ చేసింది. కానీ ఆమె సపోర్టు కే ఫలితం రాలేదు. జగన్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాడు. దీంతో శ్రీ రెడ్డి మళ్ళీ జగన్ పై కూడా విమర్శలు చేస్తూ వచ్చింది. ఓడిపోయినా కానీ కార్యకర్తలను పట్టించుకోవాలని జగన్ కు వార్నింగ్ లు ఇచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు టిడిపిని విపరీతంగా తిట్టిపోసిన శ్రీ రెడ్డిని ఇప్పుడు టిడిపి వారు దారుణంగా టార్గెట్ చేశారు. ఆమెను ఎక్కడపడితే అక్కడ నిందిస్తున్నారు. కేసులు కూడా పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే తరుణంలో వైసిపి వాళ్లు కూడా శ్రీ రెడ్డిని పట్టించుకోవడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: