పుష్ప 2 మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా అదేవిధంగా విడుదలైన అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్, డైలాగ్స్, అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దాంతో ఇప్పుడు పుష్ప 2 మూవీపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ షూటింగ్ సగంలోనే ఆగిపోయినట్లు మొన్నటి దాకా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని బన్నీ వాసు ద్వారా తేలింది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది.


ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ క్లైమాక్స్ షూటింగ్ వీడియో ఒకటి లీక్ అయింది. ఓ యాక్షన్ సీన్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై అల్లు అర్జున్ అభిమానులు బాగా ఫైర్ అవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఇలా వాయిదాలు పడితే కచ్చితంగా సినిమాని ఎవరూ చూడరు. భారతీయుడు 2 కూడా అలాగే వాయిదా పడి మినిమం బజ్ లేక ఇప్పుడు పెద్ద డిజాస్టర్ అయింది. పుష్ప కూడా అలా అయిపోతుందేమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. పైగా ఇప్పటిదాకా రిలీజ్ అయిన టీజర్ కి రెండు పాటలకి పుష్ప 1 సినిమా అంత రేంజ్ బజ్ అయితే రాలేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: