రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ ఫిక్షనల్ థ్రిల్లర్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సీనియర్ హీరోలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రిలీజై దాదాపు నెలరోజులు గడిచిపోయింది. . జూన్ 27న గ్రాండ్ గా రిలీజైన కల్కి ఇప్పటికే ఏకంగా రూ.1200 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా ఆడుతున్నప్పటికీ థియేట్రికల్ రన్ అనేది దాదాపుగా చివరకొచ్చేసింది. దీంతో కల్కి మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది. 'కల్కి' మూవీ తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తమిళ, కన్నడ ఇంకా మలయాళ భాషల హక్కులు కూడా అమెజాన్ ప్రైమ్ చేతిలో నే ఉన్నాయి. 

ఒక్క హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ కంపెనీ దక్కించుకుంది.కాగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత 8 వారాల తర్వాతే  ఓటీటీలోకి తీసుకురావాలని ముందే అగ్రిమెంట్ అనేది జరిగిందట. దీని ప్రకారమే ఆగస్టు 23 వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన కల్కి 2898 ఏడిని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారట. ఒకవేళ లేదంటే ఒక వారం ముందుగానే అంటే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15నే ఓటీటీలోకి కల్కి సినిమాని తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది ఈ మూవీని చూసే అవకాశముంది. కాబట్టి ఓటీటీ సంస్థలు కూడా ఈ తేదీనే లాక్ చేయనున్నాయని సమాచారం తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. వైజయంతీ బ్యానర్ పై 600 కోట్లతో అశ్వినీదత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కల్కి మూవీలో దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ మాళవిక నాయర్, విజయ దేవర కొండ ఇంకా అలాగే దుల్కర్ సల్మాన్ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: