ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే ఇందులో హీరో తండ్రి ఏ పాపం చేయకపోయినా అతడిని మర్డర్ చేస్తారు. ఆ హంతకుల నుంచి అన్నదమ్ములు ఎస్కేప్ అవుతారు. పారిపోయే సమయంలో ఎవరి దారిన వారు వెళ్లిపోతారు కాబట్టి విడిపోతారు. ఈ అన్నదమ్ములలో ఒకరు ఎదురు లేని మనిషి అయితే, మరొకరు పోలీసు ఆఫీసర్ అయి తమ తండ్రిని చంపిన హంతకులను చంపాలని కంకణం కట్టుకుంటారు.
ఇక ఈ మూవీలో హీరోయిన్ వాణిశ్రీ కైపెక్కించే పాటలతో రెచ్చిపోతుంది. సాధారణంగా ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలోనైనా హీరోని డామినేట్ చేస్తుంది. కానీ ఎన్టీఆర్ ముందు తేలిపోతుంది. అయితే "ఎదురు లేని మనిషి" సినిమాలోని పాటల్లో మాత్రం ఈ హీరో పైన ఆధిపత్యం చూపించడానికి చాలా ప్రయత్నించింది. సాధారణంగా ఎన్టీఆర్ తన సినిమాలోని పాటల్లో హీరోయిన్లను కొట్టేస్తుంటాడు. యమగోల , అడవిరాముడు సినిమాల్లో హీరోయిన్ జయప్రదని వీర కొట్టుడు కొట్టేసాడట. అందువల్ల ఆమె షూటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళగానే నేరుగా కాపడం పెట్టించుకునేది. ఎదురులేని మనిషి సినిమాలో కూడా ఎన్టీఆర్ వాణిశ్రీ ని యమ్మ కొట్టుడు కొట్టాడు. అందువల్ల ఆమె కూడా కాపడం పెట్టించుకునే ఉంటుందని అప్పట్లో ఫన్నీగా కామెంట్లు చేసేవారు.
కె.వి మహదేవన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఇందులోని మూడు పాటలు సూపర్ హిట్టయ్యాయి. "కసిగా ఉంది కసికసిగా ఉంది.. కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది" అనే పాట చాలా హాట్ గా ఉంటుంది. ఈ ఒక్క పాట వాళ్ళ ఈ సినిమా హిట్ అయిందని అప్పట్లో అన్నారు. "హే కృష్ణా ముకుందా మురారీ", "ఎంతవాడు ఎంతవాడు", "ఎక్కడో ఎక్కడో తగలరాని", "కంగారు ఒకటే కంగారు" పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ పాటలన్నీ ఆత్రేయ రాయడం విశేషం. కమర్షియల్ గా సక్సెస్ అయిన ఈ సినిమా 5 సెంటర్లలో 100 రోజులు పాటు నడిచింది. యూట్యూబులో ఈ సినిమాని చూడవచ్చు.