ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబ‌ల్‌ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో రెండు భాగాలుగా రాబోతున్న తొలి చిత్ర‌మిది. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్, రమ్యకృష్ణ, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందిస్తున్నారు.దేవర రెండు పార్టులుగా రాబోతుండగా.. పార్టు 1 సెప్టెంబర్‌27 న గ్రాండ్‌గా విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది కొరటాల టీం. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ తల్లి శ్రీదేవికి తగ్గ తనయగా పక్కా ప్రొఫెషనల్‌ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఈ పాన్ ఇండియా మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం పై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ను ఇన్ స్టాగ్రం లో అభిమానులతో పంచుకుంది.

“ఐ లవ్ షూటింగ్ ఫర్ దేవర” అంటూ ఫైర్ ఎమోజీ తో స్టోరీ ను పోస్ట్ చేసింది. షూటింగ్ స్పాట్ లో ఫుడ్ కి సంబందించిన ఫోటోను షేర్ చేస్తూ, దేవర సాంగ్ ను జత చేసింది. ఈ స్టోరీ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.దేవర సినిమాతోపాటు.. ఈసారి తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు దేవర సినిమాలో నటిస్తూనే మరోవైపు హిందీలో వార్ 2 మూవీలో కీలకపాత్రలో కనిపించనున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ రా ఏజెంట్ పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇదివరకే వార్ 2 చిత్రీకరణలో పాల్గొన్నాడు ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: