టాలీవుడ్ స్టార్ యాక్టర్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిమానులు సినిమా షూటింగ్స్‌ అప్‌డేట్స్‌ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు పవన్. ఆయనిప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఉప-ముఖ్యమంత్రి. పైగా కొన్ని మంత్రి పదవులు కూడా ఉన్నాయి.ఆ పనులతో ఆయన నిరంతరం బిజీగా ఉన్నారు. మరి ఆయన సినిమాల సంగతేంటి? ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు 3. వీటిలో సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. పవన్ చేస్తున్న సినిమాలన్నింటిలో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న మూవీ ఇదే. పవన్ మరో 20 రోజులు టైమ్ కేటాయిస్తే చాలు, ఓజీ షూటింగ్ పూర్తయిపోతుంది. అందుకే తన తొలి ప్రాధాన్యం ఈ సినిమాకే ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు పవన్ కల్యాణ్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ మూడో వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రావాలని పవన్ భావిస్తున్నారట. ఇది పూర్తయిన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలకు కాల్షీట్లు ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అందరికీ తెగనచ్చేసింది. గ్యాంగ్‍స్టర్‌గా పవన్ యాక్షన్, స్వాగ్ అదిరిపోయాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఓజీ మూవీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్‍కు బ్రేక్ పడింది. ఓజీ సినిమా గురించి ఇప్పుడు తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని బయటకువచ్చాయి.తాజా టాక్‌ ప్రకారం పవన్‌ కల్యాణ్‌ సెప్టెంబర్‌లో మళ్లీ మూవీ లవర్స్‌, ఫ్యాన్స్ కోసం మేకప్ వేసుకోబోతున్నాడట. దీనిపై మేకర్స్‌ నుంచి ఏం క్లారిటీ లేకున్నా ఈ వార్తలను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మేకర్స్‌.డిప్యూటీ సీఎంగా బాధ్యతలున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ పెండింగ్‌లో ఉన్న సినిమాల కోసం రెండు నెలలు సమయం ఇవ్వనున్నాడని ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మేకప్‌ వేసుకునేది నిజమే అయితే పవన్‌ కల్యాణ్‌ ఓ వైపు ప్రజా ప్రతినిధిగా, మరో వైపు యాక్టర్‌గా తన విధులను ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నది ఆసక్తికంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: