ముఖ్యంగా లావణ్య వివాదం తర్వాత రాజ్ తరుణ్ ఎక్కడ బయట కనిపించడం లేదు.. అలాగే తాను నటించిన పురుషోత్తముడు సినిమా ప్రమోషన్స్ కి ఎందుకు రాలేదు అని ప్రశ్నించగా.. అందుకు రాజ్ తరుణ్ ఇలా మాట్లాడుతూ.. తాను కూడా ఒక మనిషినే ..తనకు కూడా బాధేస్తుంది.. తాను కూడా చాలా ఎఫెక్ట్ అవుతాను వాళ్ళలాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేను . నేను చాలా సెన్సిటివ్ మనిషిని మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇలా చేస్తే తనకు బాధేస్తోంది అంటూ ఆ బాధతోని ఎన్ని రోజులు బయటికి రాలేదని తెలిపారు.
నేను ఇంకా బయటికి ఇప్పుడే రాకూడదు అనుకున్నాను కానీ తన పేరెంట్స్ మాత్రం తన వల్ల చాలా ఎఫెక్టివ్ గా చూపిస్తూ ఉండడంతో ఇవాళ మీ ముందుకు వచ్చి సమాధానాలు చెబుతున్నానంటు తెలిపారు. నేను చాలా ధైర్యం తెచ్చుకుని బయటికి వచ్చాను ఇక అలాంటివి అడిగి తనని బాధ పెట్టకండి అంటూ తెలిపారు.తాను అన్ని విషయాల పైన లీగల్ గానే ప్రొసీడ్ అవుతానని నా 32 ఏళ్ల జీవితంలో వేలాది మంది తెలిసే ఉన్నారు. ఎవరైనా ఒకరు వచ్చి తన మీద చెడుగా చెప్పమని చెప్పండి అంటు మీడియాకు సమాధానం ఇచ్చారు రాజ్ తరుణ్. హీరోయిన్ మాత్రం ఇలాంటివన్నీ కేవలం రూమర్సే అన్నట్లుగా తెలియజేసింది. తాను కూడా అన్ని విషయాలను లీగల్ గానే ప్రొసీడ్ అవుతానంటు తెలిపినట్లు సమాచారం.