టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా.. రామయ్యా వస్తావయ్యా. అలాంటి సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్‌తో హరీష్ జత కడితే అంచనాలు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో చెప్పేదేముంది? కానీ ఈ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ప్రేక్షకులను కనీస స్థాయిలో కూడా మెప్పించలేక బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.స్టార్ హీరోలతో రెండు వరుస విజయాలు అందుకున్నారు.. ఇప్పుడు మరో స్టార్‌ హీరోకి సినిమా చేస్తున్నారు. ప్రచార చిత్రాలు అదిరిపోయాయి, ఇక సినిమా విజయం ఒక్కటే పెండింగ్‌ అనుకుంటూ వచ్చిన సినిమా 'రామయ్యా వస్తావయ్యా'.తారక్, హరీష్ ఇద్దరి కెరీర్లలోనూ ఇది పెద్ద డిజాస్టర్లలో ఒకటి. నిర్మాత దిల్ రాజు సైతం తనకు అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇదొకటని చెప్పుకున్నారు. ఐతే ఎలాంటి దర్శకుడైనా సినిమా పోయాక దాని మీద పోస్టు మార్టం చేసుకుంటాడు. హరీష్ శంకర్ సైతం అదే చేసుకున్నాడట. ఆ సినిమా ఎందుకు పోయిందో తనకు తర్వాత అర్థమైందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ చెప్పాడు.రామయ్యా వస్తావయ్యా సినిమాకు సెకండాఫే సమస్య అని హరీష్ చెప్పాడు.ఇంటర్ వెల్ ల్లోనే మెయిన్ విలన్ చనిపోతాడని, అక్కడే సినిమా అయిపోయిందని, ముందే ప్రధాన విలన్ చనిపోవడంతో ఇంక చూడ్డానికి ఏముందని ప్రేక్షకులు ఫీలయ్యారని హరీష్ శంకర్ తెలిపారు.సెకండాఫ్ కథ, స్క్రీన్ ప్లే సరిగా చేసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.ఈ సినిమా కోసం తాను ఎంతగానో కష్టపడినట్లు ఆయన చెప్పుకొచ్చారు.తాను దర్శకత్వం వహించిన మిరపకాయ్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల తర్వాత తనపై అంచనాలు భారీగా పెరిగా ఆ అంచనాలను మరింత పెంచుకోవాలని ఉద్దేశంతోనే ఈ సినిమాను చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.కానీ ఊహించని విధంగా ఈ సినిమా ఆ దారుణమైన ఫలితాలను అందించినదని ఆయన చెప్పుకొచ్చారు.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హరిశ్ శంకర్ ఈ విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: