పూజా హెగ్దే టాలీవుడ్ నుంచి ఆఫర్ కోస్మ్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఐతే ఆమెను కాదని అందరికీ ఆఫర్లు ఇస్తున్నారు. మరోపక్క కోలీవుడ్ లో కూడా పూజా హెగ్దేకి ఆఫర్ రాగా తెలుగు పరిశ్రమ నుంచి మాత్రం అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదు. ఈమధ్య నాగ చైతన్య కార్తీక్ దండు కాంబో సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని హడావిడి చేశారు కానీ ఆ వార్తల్లో కూడా నిజం ఉందని తెలియట్లేదు.
ఓ పక్క బాలీవుడ్ ఆఫర్లు కూడా మందగించడంతో పూజా హెగ్దే ఎంచక్కా హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తుంది. మొన్నటిదాకా పూజా హెగ్దేకి మంచి అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేసిన తెలుగు పరిశ్రమ సడెన్ గా ఆమెపై ఎందుకు ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తుంది అన్నది తెలియట్లేదు. మరోపక్క బీస్ట్ సినిమా తర్వాత పూజ ఫైనల్ గా సూర్య 44లో ఛాన్స్ కొట్టేసింది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో పూజా హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. తప్పకుండా అమ్మడు ఈ ఛాన్స్ ని అన్నివిధాలుగా వాడుకుంటే బాగుంటుందని అంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం పూజా తన ప్రతి ఫోటో షూట్ తో రచ్చ రచ్చ చేస్తుంది. అమ్మడు ఏ ఫోటో షేర్ చేసినా సరే దానికి లక్షల కొద్ది లైక్స్ వస్తున్నాయి.