స్వీటీ అనుష్క నిశ్శబ్ధం సినిమా తర్వాత దాదాపు 3 ఏళ్ల పైన సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆమె కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కూడా సినిమాల విషయంలో ఎందుకో ఆ టైంలో వెనక్కి తగ్గింది అనుష్క. ఐతే లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను అలరించింది అమ్మడు. ఆ తర్వాత రీసెంట్ గానే క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తుంది.

క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫిమేల్ సెంట్రిక్ కథతో వస్తుందని టాక్. అందుకే ఈ సినిమాతో అనుష్క మరోసారి తన సత్తా చాటుతుందని అంటున్నారు. అంతేకాదు అనుష్క కంబ్యాక్ మూవీగా ఇది వస్తుందని అంటున్నారు. ఒక రియల్ ఇన్సిడెంట్ ని స్పూర్తిగా తీసుకుని అనుష్కతో ఈ సినిమా చేస్తున్నాడు క్రిష్. అయితే అంతకుముందు క్రిష్ డైరెక్షన్ లో వేదం సినిమాలో నటించింది అనుష్క.

ఆ సినిమాలో వేశ్య పాత్రలో సర్ ప్రైజ్ చేసింది అమ్మడు. అల్లు అర్జున్ లీడ్ రోల్ లో మంచు మనోజ్ కూడా సినిమాలో మంచి పాత్ర చేశాడు. ఐతే మరోసారి క్రిష్ డైరెక్షన్ లో అనుష్క సినిమా అనగానే ప్రేక్షకులకు వేదం సినిమా రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు అనుష్క కమర్షియల్ సినిమాలు కూడా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే ఆ విషయంలో మాత్రం అమ్మడు ఇప్పుడప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకునేలా లేదని తెలుస్తుంది. మరి అనుష్క తన ఫ్యాన్స్ గురించి ఏం ఆలోచిస్తుందో కానీ స్వీటీ మాత్రం తన ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకునే సినిమాలనే అందించాలని అనుకుంటుంది. అందుకే వచ్చిన ప్రతి సినిమా చేయకుండా అనుష్క సినిమాల విషయంలో స్లోగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే కాకుండా మలయాళంలో కూడా అనుష్క లీడ్ రోల్ లో ఒక సినిమా వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: