అయితే ఆయా స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కు సంబంధించిన వార్తలు కూడా ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అది నిజమో కాదు అనే ఒక క్లారిటీ లేకున్నా.. వామ్మో స్టార్ హీరోలు ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారా అని అందరూ చర్చించుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో ఎంతోమంది హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోవడం కంటే ఏకంగా లాభాల్లో వాటా తీసుకుంటూ ఉండటం ఇక సర్వసాధారణంగా మారిపోయింది.
కాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఇలాగే తన సూపర్ హిట్ మూవీ ఒక దానికి రెమ్యూనరేషన్ తీసుకోలేదట. స్టార్ హీరో విజయ్ సేతుపతి డైరెక్టర్ నితిన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన మహారాజ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 100 కోట్ల క్లబ్లో కూడా చేరిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా పారితోషం తీసుకోలేదట. కేవలం 20 కోట్ల పరిమిత బడ్జెట్ మాత్రమే ఉండడంతో.. తనకు రెమ్యూనరేషన్ వద్దు అని చెప్పేసాడట. అయితే ఇక ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో లాభాల్లో వాటా తీసుకునే అవకాశం ఉంది. కాగా మొదటి నుంచి విజయ్ సేతుపతి.. కథ నచ్చిందంటే రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా సినిమాలు చేసేయడం చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే.