ప్రభాస్ కెరియర్ లో హిందీ వర్షన్ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ 511 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరో గా దిశ పటని హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ లో 286.85 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. ఇకపోతే జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికి కూడా డీసెంట్ కలెక్షన్ లను హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

సలార్ పార్ట్ 1 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ 153.85 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సాహో : ప్రభాస్ హీరోగా శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ 150 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ 148 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి 1 : ప్రభాస్ హీరో గా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ 118 కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: