టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన రవితేజ తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు.స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా మాస్ క్యారెక్టర్స్ నే ఎంచుకుంటూ తనదైన శైలిలో అలరిస్తున్న రవితేజ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ చేసిన సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.హరీష్, రవితేజ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, సాంగ్స్.. ముఖ్యంగా హీరోయిన్ గ్లామర్ అయితే వాటిని మరింత పెంచాయి. ఇవన్నీ కూడా కచ్చితంగా మూవీ చూడాలనిపించేంతగా హైప్ సృష్టించాయి. ఇక ఈ సినిమాతో పుణె బ్యూటీ టాలీవుడ్ లోకి వస్తోంది.మంచి మోడల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న భాగ్య శ్రీ బొర్సే.. ఇప్పటికే యారియన్-2 అనే మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. 


ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే రవితేజ, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగా పండినట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటిదాకా వదిలిన పోస్టర్లు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. దీంతో వారిద్దరి సాలిడ్ కెమిస్ట్రీకి అనేక ప్రశంసలు లభిస్తున్నాయి.అదే సమయంలో కొంతమంది భాగ్యశ్రీ వయసును ప్రస్తావిస్తున్నారు. 25 ఏళ్ల ఆమె.. తనకంటూ రెట్టింపు ఏజ్ ఉన్న హీరోతో రొమాన్స్ చేయడం అసలు ఏం బాలేదని చెబుతున్నారు. అయినా కూడా మేకర్స్ తగ్గడం లేదు. మిస్టర్ బచ్చన్ మేకర్స్ ట్రోల్స్ పట్టించుకోనట్లు కనిపిస్తుంది. వారి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చేలా ఉండే కొత్త పోస్టర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చెయ్యడం జరిగింది.జిక్కీ సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. రొమాంటిక్ పోస్టర్ ను మేకర్స్ షేర్ చేశారు. అందులో హీరోయిన్ ను హత్తుకుని రవితేజ నడుముపై ముద్దు పెడుతున్న స్టిల్ చాలా హాట్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: