తెలుగు, తమిళ్ ,మలయాళం వంటి భాషలలో ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆండ్రియా. ఎన్నో చిత్రాలలో బోల్డ్ పాత్రలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే పలు రకాల ఎఫైర్స్ వార్తలు లోనే నిరంతరం నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తనకంటే వయసులో ఐదేళ్లు చిన్నవాడైన ప్రముఖ సింగర్ అనిరుద్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతోందనే విధంగా గతంలో వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఈ విషయం పైన ఏ ఒక్కరు కూడా స్పందించలేదు.


అంతేకాకుండా విరు ఇద్దరికీ సంబంధించి కొన్ని ప్రైవేటు ఫోటోలు కూడా అప్పట్లో కోలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక సంచలనంగా మారింది.. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ జరిగిందనే విధంగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం అయితే ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా  సినిమాలకు దూరంగా ఉన్న ఆండ్రియా సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ వోలకపోయడంలో మరెవరు సాటి రారని అంతగా చూపిస్తూ ఉంటుంది.




ఆండ్రియా హీరోయిన్ గానే కాకుండా తమిళంలో పలు రకాల సినిమాలలో పాటలు కూడా పాడుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 38 సంవత్సరాలు.. ప్రస్తుతం అనిరుద్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పేరు పొందారు. ఒక చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా అందుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ ఉన్నప్పటికీ వీరిద్దరి పర్సనల్ ఫోటోలు లీక్ అవడం చేత అందరూ ఆశ్చర్యపోయారు.. ఈ విషయంపై గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆండ్రియా  పై  ప్రేమ విషయంపై అడిగినప్పుడు.. అనిరుద్ ఇలా మాట్లాడుతూ..అది ప్రేమ కాదు అప్పుడు తన వయసు  19 సంవత్సరాలు తన వయసు 25 ఏళ్ళని చెప్పడంతో ఏజ్ గ్యాప్ వల్ల ఇద్దరు విడిపోయారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: