యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్  కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం కల్కి 2898AD ఈ చిత్రం జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే 1150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే తాజాగా చిత్ర బృందం ఫ్యాన్స్ కు సైతం మరొక అద్భుతమైన ఆఫర్ నీ తీసుకువచ్చింది. అదేమిటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


కల్కి సినిమా చూడాలనుకునే వారికి కేవలం 100 రూపాయలకే సినిమా టికెట్నుకొని చూడవచ్చట. ఈ విషయాన్ని స్వయంగా వైజయంతి మూవీస్ బ్యానర్ వారి ప్రకటించారు. అయితే ఈ సదుపాయం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో కూడా చూడవచ్చు అంటే తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఆఫర్ ఆగస్టు రెండవ తేదీ నుంచి 9వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే అందుకు గల కారణం ఏంటని విషయం మాత్రం తెలుపలేదు కానీ ఈ విషయాన్ని తెలియజేశారు.


వైజయంతి మూవీస్ బ్యానర్ పైన అశ్వని దత్ కల్కి చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మించడం జరిగింది. ఇందులో దీపికా పదుకొనే అద్భుతంగా నటించింది. ఇక అమితాబచ్చన్, కమలహాసన్ వంటి వారు లేకపోతే ఈ సినిమానే లేదని అంతగా నటించడం జరిగింది. కీలకమైన పాత్రలో చాలామంది సెలబ్రిటీలు కూడా నటించారు. ఏది ఏమైనా కల్కి సినిమా చూడని వారికి కుటుంబంతో సహా వెళ్లి చూసేందుకు ఈ సినిమా రేట్లు తగ్గించడం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ సినిమా సీక్వెల్ కూడా ఇప్పటికే 60% పైగా సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా ఇటీవలే అశ్వని దత్త కూడా తెలియజేశారు. ఈ చిత్రాన్ని కూడా వచ్చే యేడాది విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: