తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ గా కెరియర్ను కొనసాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన తన కెరియర్ ను ప్రారంభించిన మొదటి నుండే మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు. ఇక ఈయన కెరియర్ ను డీ సినిమా విజయం మలుపు తిప్పింది. ఈ సినిమాలో కథను ఆయన కమర్షియల్ పద్ధతిలో ప్లస్ మైండ్ గేమ్ తో చూపించాడు. దానితో ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ పండింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత రెడీ , దూకుడు సినిమాలను దాదాపు ఇదే పద్ధతిలో తెరకెక్కించిన ఈ దర్శకుడికి ఈ సినిమాల ద్వారా కూడా మంచి విజయాలు దక్కాయి.

ఇక దూకుడు సినిమా అయితే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేయడంతో ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన చేరిపోయాడు. ఇక అప్పటి నుండే ఈయన డౌన్ ఫాల్ ప్రారంభం అయింది. ఈయన దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా దూకుడు తర్వాత ఆరెంజ్ విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం శ్రీను వైట్ల , గోపీచంద్ హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా విశ్వం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం ఓ వీడియోని విడుదల చేసింది. ఇందులో ట్రెయిన్ వచ్చే ఒక కామెడీ సీన్ ఉండబోతున్నట్లు మూవీ యూనిట్ చూపించింది. గతంలో శ్రీను వైట్ల "వెంకీ" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇందులో కూడా ఒక ట్రెయిన్ సీన్ ఉంటుంది. అది సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికి కూడా ఆ సీన్ టీవీలో వచ్చింది అంటే చాలా చూస్తూ ఉంటారు. ఇక అలాంటి బ్లాక్ బాస్టర్ సీన్ ను శ్రీను వైట్ల "విశ్వం" సినిమాలో రిపీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి వెంకీ సినిమాకు వచ్చిన స్థాయి రెస్పాన్స్ విశ్వం సినిమాలో కూడా ట్రైన్ సీన్ కి వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: