తెలుగు , తమిళ సినీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో కీర్తి సురేష్ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించినప్పటికీ అందులో చాలా వరకు గ్లామర్ షో కు దూరంగా ఉంటూ డీసెంట్ అండ్ క్లాస్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయలేదు. 

ఈ సినిమాలో తన స్కిన్ షో తో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించింది. గతంలో ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా వరకు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలనే ఎక్కువగా పోస్ట్ చేస్తూ వచ్చేది. ఇక అక్కడ కూడా ఈమె అందాల ఆరబోతను ప్రారంభించింది. ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా అవి సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కీర్తి ఏదైనా ఈవెంట్లకు వెళ్లినా కూడా ఈ మధ్య కాలంలో స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళుతుంది.

దానితో ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఈమె వైపే తిరుగుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీఈవెంట్ కు వెళ్ళింది. దానికి పింక్ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి వెళ్ళింది. పింక్ కలర్ సారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉండడంతో ఆ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని బ్యూటీ వైపు తిరిగాయి. దానితో ఈమె ఆ ఫోటోలకు అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks