బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది.స్వర్గీయ శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’ తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘ఉలఝ్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.'ఎలాంటి పాత్రలో నటించకూడదని అనుకుంటున్నారు?' అని ఓ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు జాన్వీకపూర్ సమాధానమిచ్చింది. తన కెరీర్‌ను మార్చేదైనా, జుట్టు లేకుండా కనిపించే పాత్రను మాత్రం అస్సలు అంగీకరించనని తెలిపింది. "జుట్టు లేకుండా నటించాల్సి వస్తే నేను కచ్చితంగా నో చెబుతాను. ఎంత కష్టమైన పాత్రను అయినా చేస్తాగానీ జుట్టులేకుండా మాత్రం కనిపించను. ఉలఝ్‌లో నా పాత్ర కోసం దర్శకుడు హెయిర్‌ను కొంత కట్‌ చేయాలని అన్నారు. కానీ నేను గొడవపడ్డా(నవ్వుతూ). నా మొదటి సినిమా ‘ధడక్‌’ కోసం జుట్టు కత్తిరించుకున్నాను. ఎందుకిలా చేశావ్‌? అని మా అమ్మ అరిచింది. ఏ పాత్ర కోసమైనా జుట్టు మాత్రం కట్‌ చేసుకోవద్దని సూచించింది. నా హెయిర్ అంటే ఆమెకు అంత ఇష్టం. ప్రతి మూడు రోజులకు ఓ సారి ఆయిల్‌ రాసి మసాజ్‌ చేసేది. అందుకే అమ్మ కోసం హెయిర్‌ కట్ చేసుకోను’’ అని చెప్పింది.ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ జాన్వీ.  ఆమె నటించిన దేవర చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది.దేవర చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెడుతుంది జాన్వీ కపూర్. ఈ సినిమాలో జూ ఎన్టీఆర్‌కి జోడీగా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. దేవర తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో RC16లో నటించబోతుంది జాను. ఈ రెండు సినిమాల తర్వాత ఖచ్చితంగా టాలీవుడ్‌లో జాన్వీకి వరుస అవకాశాలు వస్తాయని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు.తెలుగుతో పాటు బాలీవుడ్‌లో మరో రెండు సినిమాలకు సైతం అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: