డైరెక్టర్ శంకర్ సినిమా విడుదలవుతోంది అంటే చాలు గతంలో చాలా మంది తమ సినిమాలను పోస్ట్ ఫోన్ చేసుకునేవారు.. ఎందుకంటే అప్పట్లోనే తెలుగు, తమిళ్, హిందీ , మలయాళంలో కూడా ఈయన డైరెక్టర్ చేసిన సినిమాలు విడుదలై మంచి సక్సెస్ లను అందుకున్నాయి.  రోబో సినిమాతో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఒక్కసారిగా ఈయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటినుంచి శంకర్ డైరెక్షన్ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగిపోయింది.



తాజాగా విడుదలైన ఇండియన్-2 సినిమా అయితే శంకర్ కెరియర్ లోనే ఒక డిజాస్టర్ మూవీ గా మారిపోయింది.. రోబో తర్వాత చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు ఐ, రోబో 2.o సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ డబ్బులు మాత్రం వచ్చాయి.. ఇప్పటికీ ఆ సినిమాలని ప్రేక్షకులైతే బాగానే చూస్తున్నారు.. ఇటీవల విడుదలైన ఇండియన్-2 సినిమా కథ విషయంలో ప్రేక్షకులను డైరెక్టర్ శంకర్ అసహనానికి గురి చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. 28 ఏళ్ల క్రితం శంకర్ కమల్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్-2 చిత్రాన్ని తెరకెక్కించారు.



2017 లో స్టార్ట్ అయిన ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. 1000 కోట్ల కలెక్షన్ టార్గెట్తో ఇండియన్-2 సినిమా అందుకుంటుందని అభిమానులు అనుకున్నప్పటికీ కేవలం లాంగ్ రన్ టైంలో 150 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది.. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కనీసం  పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. సౌత్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు మొదలైంది కోలీవుడ్ డైరెక్టర్లతోనే అని చెప్పవచ్చు.. ఇప్పుడు ఇలాంటి డైరెక్టర్లు సరైన కథలను ఎంచుకోక కోట్ల రూపాయల నష్టాన్ని మిగులుస్తున్నారని విధంగా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మరి రామ్ చరణ్ తో తీస్తున్న గేమ్ చేంజెస్ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అంటే అభిమానులు భయభ్రాంతులకు గురవుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: