మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెట్టిన మొదటి అమ్మాయి అని చెప్పుకోవచ్చు. కానీ నిహారిక నటించిన సినిమాలు బాక్సాఫిను వద్ద పెద్దగా ఆడలేదు. అదేంటో తెలియదు కానీ మెగా ఫ్యామిలీకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నాయి అమ్మడుకు అంతగా సపోర్ట్ చేయలేదు. మేబి సిల్వర్ స్క్రీన్ పై మెగా డాటర్ కనిపించకూడదు..మెగా కుటుంబంలోని అమ్మాయిలంతా సాంప్రదాయం గానే ఉండాలనుకున్నారేమో. అందుకే సినిమాలో పెద్దగా రాణించలేదంటూ నెటిజన్లో కామెంట్లు చేస్తున్నారు.


ఇక మూడేళ్ల కింద నిహారికను సిద్ధూ జొన్నలగడ్డకిచ్చి నాగబాబు అంగరంగ వైభవంగా వివాహం జరిపించిన విషయం తెలిసిందే. కానీ పలు కారణాల వల్ల వీరిద్దరూ డివోస్ తీసుకున్నారు. దీంతో మెగా డాటర్సకు పెళ్లిళ్లు కలిసి రావటం లేదంటూ జనాలు నెట్టింట చర్చించుకున్నారు. విడాకుల అనంతరం నిహారిక తన కెరియర్ పై దృష్టి సారించింది. ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. 'కమిటీ కుర్రాళ్లు' అని టైటిల్ తో తర్కెక్కే సినిమాను నిర్మించింది. ఈ చిత్రం ఆగస్టు 9 వ తేదీన థియేటర్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటోన్న నిహారిక పలు విషయాలు బయటపెడుతూ వస్తుంది.


తాజాగా మెగా డాటర్ కు ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్న ఎదురైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్..?ఈ ముగ్గురిలో ఎవరంటే ఎక్కువగా ఇష్టమని యాంకర్ అడగ్గా..ఎలాంటి సందేహం లేకుండా నిహారిక వెంటనే పాన్ ఇండియా స్టార్ నేమ్ చెప్పేసింది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టమని, రెబల్ స్టార్ కామెడీ అంటే పిచ్చి ఇష్టమని వెల్లడించింది. ఆయన నటించిన సినిమాల్లో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీస్ ఎంతగానో నచ్చుతుందని..ప్రభాస్ తో నటించే అవకాశం మాత్రం వస్తే అస్సలు వదులుకోనని నిహారిక చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: