దాదాపు 16 మంది కొత్త యాక్టర్లతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రం ఈనెల 9న రిలీజ్ కానుంది. దర్శకుడు యదు వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నిహారిక కొణిదెల సమర్పిస్తోంది. దీనిని నిహారిక తల్లి పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా విడుదలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి నిహారిక దీనిని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక ఓ అదిరిపోయే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 

అదేంటంటే, నిహారిక జనసేన పార్టీ విజయం సాధించిన 21 నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్‌ ప్లే చేయాలని డిసైడ్ అయ్యిందని సమాచారం. అయితే ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమ చిత్రానికి బాగా సపోర్టు, హైప్ రావాలనే నిహారిక ఈవిధంగా ప్లాన్‌ చేసినట్లు సినిమా వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

కమిటీ కుర్రోళ్ళు ఒక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో సాయికుమార్‌, శ్రీలక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించారు. అనుదీప్‌ దేవ్‌ మ్యూజిక్ అందించాడు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ పిక్స్, ట్రైలర్స్‌, పాటలు ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెంచేసాయి. నిహారిక తన వినూత్నమైన ప్లాన్లతో దీనిపై మరింత హైప్‌ పెంచుతున్నారు. వంశీ చెప్పిన కథ తనకు తెగ నచ్చేసింది అని నిహారిక ఇంతకుముందు తెలిపింది. ఇది తప్పకుండా అందరికీ బాగా నచ్చుతుందని, మంచి వినోదాన్ని అందిస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇకపోతే పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ సొంత జనసేన పార్టీ తెలుగుదేశం, భాజపాతో పొత్తు పెట్టుకొని ఈసారి పోటీకి వెళ్ళింది అయితే అనూహ్యంగా 100% సక్సెస్ రేట్ సాధించి అధికారంలోకి వచ్చింది. 21 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థులు గెలిచారు. అక్కడే ప్రీమియర్స్‌ వేయాలని నిహారిక భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మెగా డాటర్ సినిమాను కూడా ఆ నియోజకవర్గ ప్రజలు సక్సెస్ చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: