సీతారామం అనే బ్లాక్ బస్టర్ మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన మృనాల్ ఠాగూర్.. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఎంతోమంది సినీ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు వరుసగా అవకాశాలను కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మా. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఫుల్ బిజీగా ఉంది. అయితే మృనాల్ ఠాగూర్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఒక విషయంపై ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది.


 ఏకంగా ఆమె తొడలు లావుగా ఉన్నాయి అంటూ నేటిజెన్లు ఎప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శల గురించి అస్సలు పట్టించుకోని మృనాల్ ఠాగూర్ సోషల్ మీడియాలో మాత్రం ఇక ఎన్నో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. కాగా ఇటీవల తన తొడలపై వస్తున్న విమర్శల గురించి స్పందించిన ఈ హీరోయిన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాకు థిక్ థైస్ ఉన్నాయి. ఆ విషయంలో నాకు ఎలాంటి రిగ్రేట్ లేదు. నేను వర్కౌట్ కి వెళ్ళినప్పుడు కొందరు కామెంట్స్ చేస్తుంటారు. థైస్ తగ్గించడానికి వర్కౌట్ చేస్తున్నావా అని.


 కానీ నా థైస్ తో నాకు ఎలాంటి సమస్య లేదు. బహుశా నీకు ప్రాబ్లం ఏమో. ఎందుకంటే చాలామంది నాలాగేని థైస్ కావాలని డబ్బులు ఇచ్చి మరి వర్కౌట్స్ చేస్తుంటారు. ఇక నా థైస్ నా స్ట్రెంత్ అంటూ మృనాల్ ఠాగూర్ బోల్డ్ గా కామెంట్స్ చేసింది.  అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఆస్క్ మి ఎవ్రీథింగ్ అనే ఒక చిట్ చాట్ సెషన్ నిర్వహించగా.. ఇక థైస్ గురించి ప్రశ్న ఎదురు కావడంతో మృనాల్ ఠాగూర్ ఇలాంటి కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ హీరోయిన్ తదుపరి చిత్రల అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: