ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటించిన తాజా చిత్రం డార్లింగ్. ఇక ఈ సినిమాతో అశ్విన్ రామ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  కాగా ఈ చిత్రం విడుదలైన నెలరోజులు కాకముందే ఓటీటీ లోకి రావడానికి సిద్ధమైంది. ఈ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. 'డార్లింగ్' చిత్రం ఆగస్టు 13 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం

 అందుబాటులో ఉంటుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను డిస్నీ+హాట్‌స్టార్‌  శుక్రవారం రోజు అనౌన్స్ చేసింది. డార్లింగ్ మూవీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత నభానటేష్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆనంది పాత్రకు న్యాయం చేసేందుకు నభా నటేష్ చాలా కష్టపడింది. దర్శకుడి రాసుకున్న కథలో క్లారిటీ లేకపోవడంతో ఆమె కష్టం వృథాగా మారింది అని చెప్పవచ్చు. డార్లింగ్ మూవీని హనుమాన్ ప్రొడ్యూసర్స్‌ నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. అయితే 'డార్లింగ్' సినిమా  ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా

 ఆకట్టుకున్నాయి. ప్రియదర్శి, నభానటేష్ జంటగా కనిపించే ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ దర్శకుడు తాను అనుకున్న కథను కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడంలో ఆయన తడబడటంతో డార్లింగ్ సినిమా  ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇక ఇందులో  అనన్య నాగళ్ల గెస్ట్ రోల్‌లో కనిపించింది. బ్రహ్మానందం, రఘుబాబు, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.  మరి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం గత జూలై 19న థియేటర్స్ లోకి మంచి ప్రమోషన్స్ ని చేసుకొని వచ్చింది. కానీ సినిమా అనుకున్న రేంజ్ లో రాణించలేదు. దీనితో థియేట్రికల్ గా రన్ ని ముగించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: