బుల్లితెర నటీనటులైన నవ్య స్వామి, రవి కృష్ణ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు బుల్లితెరపై సీరియల్ ఆర్టిస్టులుగా మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పైగా వెండితెరపై కూడా ఇతర అవకాశాలు అందుకొని మంచి మంచి సినిమాలు చేశారు. ఇక వీరిద్దరూ కలిసి గతంలో ఆమె కథ అనే సీరియల్ లో నటించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారారు. బుల్లితెరపై ఏదైనా షో లలో కూడా రీల్ కపుల్స్ గా పాల్గొని తమ పర్ఫామెన్స్ తో బాగా

 సందడి చేస్తూ ఉంటారు. అయితే గతంలో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి. కానీ తమ మధ్య ప్రేమ లేదని అవన్నీ పుకార్లేనని కొన్ని ఇంటర్వ్యూల ద్వారా స్పష్టం చేశారు. కానీ నవ్య స్వామి ఏ పోస్ట్ పంచుకున్న వెంటనే రవి కృష్ణ లవ్ సింబల్ తో స్పందిస్తూ ఉంటాడు. గతంలో మాదిరిగా ఇప్పుడు బుల్లితెరపై కనిపించకపోవడంతో రవికృష్ణ, నవ్యస్వామి లవ్ ట్రాక్ గురించి పెద్దగా వార్తలు రావడం లేదు. దీంతో వీళ్ల గురించి చర్చలు కూడా జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రవికృష్ణ ఓ ఇంటర్వ్యూలో

 పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నవ్యస్వామి గురించి యాంకర్ ప్రశ్నించడంతో ఆమె తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత రవికృష్ణ కొనసాగిస్తూ.. 'నేను గతంలో నవ్యస్వామితో షోలలో చేసినవి అన్నీ స్కిట్లు మాత్రమే. వాస్తవానికి మా ఇద్దరి మధ్యా అలాంటి రిలేషన్ అయితే లేదు. మా వరకూ మాకు ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది. కానీ, చాలా మంది మా గురించి ఏవేవో అనుకున్నారు' అని చెప్పుకొచ్చాడు. తద్వారా తమ మధ్య లవ్ లాంటిది ఏమీ లేదని రవికృష్ణ తేల్చి చెప్పేశాడు. రవి కృష్ణ కూడా ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే నవ్య స్వామి స్పందిస్తూ ఉంటుంది. పైగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటూ ఉంటారు. చూస్తుండగానే చాలా క్లోజ్ గా ఉంటూ తమ మధ్య ఏదీ లేదు అన్నట్లుగా క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ జనాలు మాత్రం వీరి మధ్య ఏదో నడుస్తుంది అని.. ఆ విషయం బయటకి చెప్పుకోవటానికి వీళ్లు ఇష్టపడటం లేదని అనుకుంటూ ఉంటారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: