సినీ ఇండస్ట్రీలో ఉండే కొంతమంది నటీనటులకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ వస్తుంది. దానికి కారణం వాళ్ళు చేసిన వరుస సినిమాలు ప్లాప్ అవ్వడమే. అయితే అప్పట్లో ఓ హీరోయిన్ ని నిర్మాత అశ్వినీ దత్ ఆమె పెద్ద ఐరన్ లెగ్.. ఆమెని తీసుకోవడమే తప్పైపోయింది  అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి ఇంతకీ అశ్విని దత్ ఎవరిని ఐరన్ లెగ్ అని అన్నారో ఇప్పుడు చూద్దాం.. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై  అశ్విని దత్ నిర్మించిన జై చిరంజీవ సినిమా అందరూ చూసే ఉంటారు.ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా భూమిక, సమీరా రెడ్డిలు నటించారు. 

అయితే ఈ సినిమాలో భూమికను అనుకున్నాక సెకండ్ హీరోయిన్ గా సమీరా రెడ్డిని తీసుకుందామని డైరెక్టర్ అన్నారట. అయితే నిర్మాత వద్దని చెప్పినప్పటికీ డైరెక్టర్ మాత్రం ఆమె నటించిన సినిమాలు చూశాను. చాలా బాగున్నాయి. ఆమె నటన బాగుంది అని చెప్పడంతో చేసేదేమీ లేక అశ్వినీ దత్ ఓకే చెప్పారట.కానీ తీరా సినిమా షూటింగ్ పూర్తయి విడుదలైన సమయంలో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా రిజల్ట్ గురించి ఓ ఇంటర్వ్యూలో అశ్వినీ దత్ మాట్లాడుతూ.. జై చిరంజీవ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాం. అలాగే ఈ సినిమాలో అన్నీ మంచి సన్నివేశాలే ఉన్నాయి.

కానీ ఆ హీరోయిన్ ఐరన్ లెగ్..ఆమెతో తీసిన సన్నివేశాలు ఏ మాత్రం సినిమాకి హైలెట్ అవ్వలేదు. సమీరా రెడ్డి వల్ల సినిమాకి ఎలాంటి ప్లస్ లేదు. అందుకు తోడు ఈ సినిమా సమయంలో కొన్ని అనర్ధాలు కూడా చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి మణిశర్మ రేంజ్ కి తగ్గట్లు కూడా జై చిరంజీవ సినిమా మ్యూజిక్ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ గా మారింది అంటూ నిర్మాత అశ్వినీ దత్  సంచలన కామెంట్లు చేశారు.ఇక ఆ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డిని ఐరన్ లెగ్ అంటూ నిర్మాత అవమానించడం అప్పట్లో చాలా వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: