ఈసినిమాను తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు హీరోలు కూడ పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు ‘రాయన్’ సినిమా చూసి ఆమూవీ పై పెట్టిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈమూవీ తాను చూశానని ధనుష్ చాల అద్భుతంగా నటించాడని ఈసినిమాకు పనిచేసిన ఏఆర్ రెహమాన్ తో పాటు అందరి పై ప్రశంసలు కురిపిస్తూ పెట్టిన ట్వీట్ క్షణాలలో వైరల్ గా మారింది.
సాధారణంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ హీరోలు డబ్బింగ్ సినిమాల పై పెద్దగా ప్రశంసలు కురిపించరు. ప్రశంసలకు పొగడ్తలకు దూరంగా ఉండే మహేష్ ఇప్పుడు ఏకంగా ధనుష్ ను పొగుడ్తూ ట్వీట్ పెట్టడం చాలామందికి ఆశ్చర్యంగా మారింది. అయితే అన్ని విషయాలలోను చాల తెలివిగా వ్యవహరించే మహేష్ ఇలా వ్యవహరించడం వెనుక ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి.
మహేష్ తెలుగులో సూపర్ స్టార్ అయినప్పటికీ అతడి మ్యానియా తమిళ ప్రేక్షకులలో పెద్దగా లేదు. దీనికితోడు మహేష్ త్వరలో రాజామౌళి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా విడుదలకాబోతున్న ఈమూవీ రికార్డులు క్రియేట్ చేయాలి అంటే తమిళంలో కూడ ఈమూవీకి మంచి కలక్షన్స్ వచ్చి తీరాలి. ఇలా ధనుష్ ను ప్రశంశిస్తే అతడి అభిమానులు తన అభిమానులుగా తన భవిష్యత్ సినిమాలకు తమిళనాడులో కూడ మంచి కలక్షన్స్ వస్తాయి అన్న వ్యూహాత్మక ఎత్తుగడ మహేష్ ట్వీట్ లో కనిపిస్తోంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయాలు తనకు తెలియవు అని చెప్పే మహేష్ తన కెరియర్ లో మాత్రం చాల తెలివిగా అడుగులు వేస్తాడు అన్నది నిజం..