తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణ , శోభన్ బాబు లాంటి హీరోలు చాలా శాతం మల్టీస్టారర్ మూవీలలో నటించారు. ఇక వీరి కాలం పూర్తి అయిన తర్వాత చాలా వరకు మల్టీస్టారర్ సినిమాలు తెలుగులో తగ్గాయి. ఇక మళ్లీ ఆ ట్రెండ్ ను మొదలు పెట్టింది వెంకటేష్ , మహేష్ బాబు. వీరిద్దరూ చాలా కాలం తర్వాత తెలుగులో భారీ మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించారు. వీరు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీస్టారర్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఆ తర్వాత నుండి మళ్లీ తెలుగులో భారీ మల్టీస్టారర్ మూవీల ట్రెండ్ మొదలు అయింది.

ఇకపోతే ఇప్పటికే తెలుగులో ఎన్నో భారీ మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే తెలుగులో ఇలాంటి భారీ మల్టీస్టారర్ మూవీనే మరొకటి రాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. ఇకపోతే తెలుగులో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. వీరిద్దరితో ఒక భారీ మల్టీస్టారర్ మాస్ మూవీ ని మహేష్ బాబు అనే దర్శకుడు రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ దర్శకుడు కొంత కాలం క్రితం నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మిస్ శెట్టి మిస్టర్ శెట్టి అనే క్లాస్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ దర్శకుడు మరికొంత కాలంలో బాలకృష్ణ , రామ్ పోతినేని హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్ మూవీ ని రూపొందించడానికి కథను సిద్ధం చేసినట్లు , దానిని ఈ ఇద్దరు హీరోలకు వినిపించగా వారు కూడా ఈ మల్టీ స్టారర్ మూవీ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: