సినీ పరిశ్రమలో ఒక సమయంలో అద్భుతమైన విజయాలను అందుకొని స్టార్ డైరెక్టర్ల స్థాయికి వెళ్ళిన వారు కూడా ఆ తర్వాత కాలంలో వరస అపజాయలను అందుకోవడం వల్ల వారు తెరకెక్కించే సినిమాలపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఉండవు. అలాంటి పరిస్థితులను ఇప్పటికే సినీ పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆ పరిస్థితులలోనే విజయ్ భాస్కర్ కూడా ఉన్నారు. ఈయన కెరియర్ ప్రారంభించిన కొత్తలో అనేక విజయాలను అందుకున్నాడు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన విజయం అందుకున్నటువంటి నువ్వే కావాలి , నువ్వు నాకు నచ్చావ్ , మన్మధుడు , మల్లీశ్వరి , లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకోవడం వల్ల ఈయన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయిలో పెరిగిపోయింది. ఆ తర్వాత ఈయనకు అనుకున్నంత స్థాయి విజయాలు దక్కలేదు. ఈయన అద్భుతమైన ఫామ్ లో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భూమిక చావ్లా , సమీరా రెడ్డి హీరోయిన్లుగా జై చిరంజీవ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అనుకున్నంత స్థాయి విజయం అందుకోలేదు.

ఇక ఆ తర్వాత నుండి ఈయనకు ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలు దక్కాయి. మధ్యలో ప్రేమ కావాలి సినిమా మంచి విజయం అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు ఉషా పరిణయం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన ఈయన రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం అంచనాలు పెద్దగా లేవు. దానితో ఈయన భారీ ఎత్తున ఈ సినిమాకు ప్రమోషన్లు చేస్తున్నాడు. మరి ఈ మూవీ తో ఈ దర్శకుడు మంచి విజయాన్ని అందుకొని మళ్ళీ కం బ్యాక్ కావాలి అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: