చాలా మంది దర్శకులు తాము నటించిన సినిమాలలో ఏవో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి . ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు . ఈయన తన కెరియర్ ప్రారంభం లో చాలా సినిమాలకు రైటర్ గా కూడా పని చేశాడు . ఇక పటాస్ సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అనిల్ దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ఇప్పటివ్వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాలేదు.

దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపు ఉంది. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో కొన్ని మూవీ లలో ఈయన కొన్ని పాటలలో , అక్కడ , ఇక్కడ కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... నేను దర్శకుడిగా కెరియర్ ను ప్రారంభించక ముందు చాలా సినిమాలకు రైటర్ గా పని చేశాను.

అందులో భాగంగా రామ్ పోతినేని హీరోగా రూపొందిన కందిరీగ సినిమా రైటర్ గా కూడా పని చేశాను. ఇక ఆ సినిమాలో నేను నటించాలి అని ఒక చిన్న సీన్ రాసుకున్నాను. కానీ చివరగా నా కోసం రాసుకున్న సినిమాలో సప్తగిరి నటించాడు. సప్తగిరి నా కోసం రాసుకున్న పాత్రలో నటించి అద్భుతమైన రీతిలో కామెడీని పండించాడు అని అనిల్ చెప్పాడు. అలాగే సప్తగిరి నా క్లోజ్ ఫ్రెండ్ అని కూడా ఆ ఇంటర్వ్యూ లో భాగంగా అనిల్ రావిపూడి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: