టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి 90వ దశకం ప్రథమార్థంలో బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ హీరోగా విజృంభణ చేసారు. కొండవీటి దొంగ, ఘరానా మొగుడు ఇంకా అలాగే గ్యాంగ్ లీడర్ లాంటి అద్భుతమైన సినిమాలన్నీ 90వ దశకం ఆరంభంలోనే పడ్డాయి. ప్రతి సినిమా కూడా దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా అదే విధంగా చిరంజీవి నటించిన మరో అద్భుత చిత్రం కూడా 1990లోనే వచ్చింది. ఇక ఆ సినిమా ఏదో కాదు.మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇండస్ట్రీ హిట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ ఆల్ టైం హిట్స్ లో ఒకటిగా ఉంటుంది..రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి అశ్విని దత్ నిర్మాత. ఈ సినిమాకి కథ యండమూరి వీరేంద్రనాథ్ అందించారు. ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నప్పుడు ముందుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఫిక్స్ అయ్యారు. 


ఈ కథని చాలా అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ కోసం చూస్తున్నారు. అప్పుడే రాఘవేంద్ర రావు పేరు  ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ మూవీకి ముందు రాఘవేంద్ర రావు కి హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో కొంతమంది ఆయనకై సందేహం వ్యక్తం చేశారట. వేరే డైరెక్టర్ ట్రై చేద్దాం అని చెప్పినవాళ్లు కూడా ఉన్నారు. కానీ చిరంజీవి అసలు ఒప్పుకోను అన్నారట. ఫ్లాప్ డైరెక్టర్ ఎందుకు అని బయ్యర్లు కూడా కొందరు వద్దని చెప్పారట. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాఘవేంద్ర రావు అయితేనే నేను ఈ సినిమా చేస్తాను. లేకుంటే ఈ మూవీలో మీరు చిరంజీవిని మర్చిపోండని వార్నింగ్ ఇచ్చారట. దాంతో రాఘవేంద్ర రావునే డైరెక్టర్ గా ఫైనల్ చేయడం జరిగింది.వరుసగా మూడు ఫ్లాపులు తర్వాత నాపై నాకే అనుమానం ఏర్పడింది. నేను ఇక పనికి వస్తానా అని అనుకునేవాడిని. అయితే ఆ టైం లో నాపై నమ్మకం ఉంచిన చిరంజీవికి ఇంకా అశ్విని దత్ కి నేను రుణపడి ఉంటానని రాఘవేంద్ర రావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: