టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం బి గోపాల్ దర్శకత్వం లో రూపొందిన సమరసింహా రెడ్డి అనే పవర్ఫుల్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . భారీ అంచనాల నడుమ థియేటర్ల లో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపో యే రేంజ్ విజయాన్ని అందుకుంది . ఈ మూవీ ద్వారా బాలయ్య క్రేజ్ మరింత గా పెరగగా , ఈ సినిమాకు దర్శకత్వం వహించి న బి గోపాల్ క్రేజ్ కూడా విపరీతం గా పెరిగింది. 

ఇకపోతే ఈ స్థాయి విజయాన్ని అందుకున్న సమరసింహా రెడ్డి మూవీ కి హీరో గా మొదటి ఆప్షన్ బాలకృష్ణ కాదు. మరో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోను మొదటగా ఈ సినిమా కోసం అనుకున్నారు. కానీ ఆయన ఆ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం బాలకృష్ణకు వచ్చింది. ఇంతకీ ఈ సినిమా కోసం మొదట అనుకున్న హీరో ఎవరో ... ఆయన ఈ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే విషయాలను తెలుసుకుందాం.

సమరసింహా రెడ్డి మూవీ బి గోపాల్ ఈ కథను వెంకటేష్ పై తేరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుంది అని భావించాడు. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వివరించారు. ఇక వెంకటేష్ కు ఈ కథ అద్భుతంగా నచ్చినప్పటికీ ఈ స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నాపై వర్కౌట్ కాదు అని చెప్పాడట. దానితో బి గోపాల్ ఈ కథను బాలకృష్ణకు వినిపించడం , ఆయన వెంటనే ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా వెంకటేష్ తో అనుకున్న సమరసింహా రెడ్డి మూవీ లోకి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: