మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రవితేజ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రవితేజ కామెడీ చేస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసింది. రీసెంట్ గా రవితేజ 'మిస్టర్ బచ్చన్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా..ఈ చిత్రంలోనే భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఇక ఈ నెల 15 న థియేటర్లలోకి రాబోతుంది.


ఈ క్రమంలో ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ చెయ్యగా తాజాగా మరో సాంగ్ విడుదల చేశారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటను వనమాలి రాశాడు. చాలా గ్యాప్ తర్వాత వనవాలి ఓ పెద్ద సినిమాకు సాహిత్యం అందించటం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రిలీక్స్ పరంగా చాలా బాగున్నా ఈ సాంగ్..డాన్స్ పరంగా మాత్రం బి గ్రేడ్ ను తలపిస్తోంని..హీరోయిన్ అంగాంగ ప్రదర్శనే అంతియం అన్నట్లుగా..ఆమెను శరీరాన్ని అదే పనిగా తడమడమే రొమాన్స్ అన్నట్లుగా చిత్రీకరణ ఉందని..కూతురు రేంజ్ ఉన్న హీరోయిన్ తో రవితేజ చేసిన రొమాన్స్ చూస్తే అదోరకంగా ఉంది తప్ప నేచురల్ గా లేదని నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.


అలాగే ఎంతో కమర్షియల్ సినిమా అయినా.. లేస్తే అందరి గురించి అదే పనిగా నిక్కచ్చిగా ఉండాలని మాట్లాడే హరిశ్ శంకర్ లాంటి డైరెక్టర్ ఈ తరహా పాటలను ఎంకరేజ్ చేయటం ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రతిసారి హీరోయిన్ ను అలా నలిపేయడం ఏంటి నాయనా.. పాటంటే అర్థనగ్న ప్రదర్శనేనా అంటూ ఎకి పారేస్తున్నారు. ఇలాంటి చెత్త డాన్స్ ఉంటే ఎవరూ చూడరు అని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: