( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూడా గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్నో కలలు కన్న వైసిపి నాయకుల ఆశలు అన్ని అడియాసలు అయిపోయాయి. ఓడిపోవడం సంగతి అలా ఉంచితే పార్టీ చిత్తుచిత్తుగా ఘోరంగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి.. అయితే వైసిపి నుంచి గెలిచిన ఈ 11 మంది ఎమ్మెల్యేలు ... నలుగురు ఎంపీలలో కొందరు పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన 11మంది ఎమ్మెల్యేలలో తొలిసారి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎంతో కష్టపడి ఎమ్మెల్యేలుగా గెలిచాం .. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి వైసిపి కోసం పోరాటాలు చేసినా ఉపయోగం ఉండదు .. తర్వాత ఐదు సంవత్సరాలకు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ? చెప్పలేం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూడా గుర్తించే అవకాశం లేదు .. కనీసం నియోజకవర్గాలలో కూడా తమ మాట ఎలాగో నెగ్గే పరిస్థితి లేదు ... ఇన్ని ఇబ్బందులు పడుతూ వైసిపి ఎమ్మెల్యేలుగా ఉండటం కంటే తెలుగుదేశం పార్టీలో చేరి కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగితే చాలావరకు పనులు చక్కబెట్టుకోవచ్చని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.


ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎంపీ కూడా పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా మరో నెల రోజులకు లేదా రెండు నెలలకు అయినా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ ఎంపీ కండువా మార్చేస్తారని అంటున్నారు. అటు వైసీపీ అధిష్టానం కూడా త‌మ పార్టీకే చెందిన ఆ ఎమ్మెల్యేలు.. ఎంపీల విష‌యంలో ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల అనుమానాలు .. సందేహాల‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వాళ్ల పై నిఘా పెట్టినా కూడా వారు పార్టీలో కొన‌సాగే ప‌రిస్థితి లేద‌ని తేల‌డంతో జ‌గ‌న్ వారి విష‌యం లో ఏం చేయాలో తెలియ క స‌త‌మ‌త మ‌వుతున్న‌ట్టు టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: