నందమూరి నట సింహం బాలకృష్ణ ఉగ్రరూపం చూపించిన సినిమా అఖండ. మాస్ పూల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ.. టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొడుతూ భారీ హిట్ సాధించింది. కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లి బాక్సాఫీస్ షేక్ చేసింది.అయితే  ఎన్నికలు ముగిసిన తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తానని బోయపాటి చెప్పారు. అలానే 'అఖండ 2'పై కూడా రియాక్ట్ అయ్యారు. అఖండ సీక్వెల్‌లో ఏం చూపించబోతున్నారంటూ అడిగిన ప్రశ్నకి "ఈ సీక్వెల్‌లో సమాజానికి ఏం అవసరమో అదే చూపిస్తాను" అంటూ బోయపాటి బదులిచ్చారు.దీంతో ఈ సినిమాకు సీక్వల్ వస్తే ఆ లెక్కే వేరుగా ఉంటుందని ఆశపడ్డ నందమూరి అభిమానుల కోసం ఓ దిమ్మతిరిగే న్యూస్ బయటకొచ్చింది.ఇండస్ట్రీ షేక్ అయ్యే సినిమా రావాలంటే బోయపాటి శ్రీను- బాలకృష్ణ కలవాల్సిందే అన్నట్టుగా ట్రెండ్ క్రియేట్ చేసుకుంది ఈ కాంబో. అంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ హిట్స్ సాధించాయి. ఆ తర్వాత అఖండ మూవీతో హ్యాట్రిక్ కొట్టేసింది ఈ సక్సెస్‌ఫుల్ జోడీ.సినిమాల షూటింగ్‌ విషయంలో ఆలస్యం జరుగుతుందంటే బోలెడన్ని కారణాలుంటాయి. హీరో, హీరోయిన్ల కాల్షీట్‌ సర్దుబాటు కాక కావచ్చు... లొకేషన్లు కుదరక కావచ్చు... స్క్రిప్ట్ పక్కాగా కుదరకపోవడం వల్లా కావచ్చు. కానీ అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్‌ చేసుకున్న తర్వాత టోటల్‌ థీమ్‌నే మార్చాల్సి వస్తే... అప్పటిదాకా అనుకున్నదాన్ని ఇంకో రకంగా మార్చుకోవాల్సి వస్తే..అలాంటి ఒక కాన్సెప్ట్ బాలయ్య మువీ లో మారబోతుంది.ఈ నేపథ్యంలో బాలకృష్ణ రీసెంట్‌ కెరీర్‌లో అందరినీ మెస్మరైజ్‌ చేసిన సినిమాల్లో అఖండ ఒకటి. హిందీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయింది ఈ సబ్జెక్ట్. అందుకే ఎలాగైనా పార్ట్ 2 సౌండ్‌ని ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో వినిపించాలని కంకణం కట్టుకున్నారు బోయపాటి శ్రీను.

బోయపాటి డైరక్షన్‌లో బాలయ్య సినిమా చేస్తున్నారంటేనే ఫ్యాన్స్ కి ఫుల్‌ మీల్స్ రెడీ అవుతోందని అర్థం. అయితే ఈ సారి మాత్రం వంట దినుసులు మారుతున్నాయన్నది టాక్‌. ఆల్రెడీ యాంటీ గవర్నమెంట్‌ థీమ్‌తో కథను సిద్ధం చేశారట. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. అందుకే థీమ్‌ని కూడా మార్చే పనిలో పడ్డారట బోయపాటి. అందుకే అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లడానికి ఆలస్యం అవుతుందన్నది టాక్‌.ఈ నేపథ్యంలో  వీలైనంత త్వరగా అఖండ2, స్క్రిప్టు మార్చి,బాలయ్య ను కన్విన్స్ చేస్తే సినిమ సెట్స్ మీదకు వెళ్తుంది. కన్విన్సింగ్‌గా స్క్రిప్ట్ నెరేట్‌ చేసేవరకు ఈ ఆలస్యం తప్పదన్నది ఫిల్మ్ నగర్‌ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌.దీనిపై బోయపాటి ఎలా స్పందిస్తారో చూడాలి.అయితేఅఖండ మూవీ సంచలన విజయం సాధించడంలో థమన్ పాత్ర ఎంతో ఉంది. థమన్ ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. గతంలో థమన్ అఖండ సీక్వెల్ కు కొన్ని అప్ డేట్స్ సైతం ఇవ్వడం జరిగింది.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అఖండ సీక్వెల్ తెరకెక్కనుండగా ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. యానిమల్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అఖండ సీక్వెల్ కు మాత్రం థమన్ కే ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: