టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. దాదాపు స్టార్ హీరోల సరసన జతకట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సమంతసినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోయిన్ గా నిలిచింది.


తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు రహస్యంగా వీరి రిలేషన్ కొనసాగించిన ఈ జంట కొన్నేళ్ల తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక వివాహ అనంతరం ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. అతితక్కువ సమయంలోనే ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం ఎవరికివారు వారి సినీ లైఫ్ లో బిజీగా ఉంటున్నారు.


ఇక ఈ మధ్యకాలంలోనే సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నాగచైతన్యకు తెలియకుండా సమంత కొన్ని సీక్రెట్ పనులు చేసేదట. సమంతకు ఐస్ క్రీమ్ తినడం చాలా ఇష్టం ఉండేదట. నాగచైతన్యకు కూడా ఐస్క్రీమ్ అంటే ఇష్టం ఉండేదట. కానీ అర్థరాత్రి సమయంలో అస్సలు ఇష్టం ఉండేది కాదట. నాగచైతన్య ఎంత చెప్పినా కూడా వినకుండా సమంత రాత్రిపూట నాగచైతన్యకు తెలియకుండా ఐస్క్రీమ్ తినడానికి వెళ్లేదట.


నాగచైతన్యకు ఆ విషయం తెలిసి కాస్త సీరియస్ అయ్యేవాడట. అర్ధరాత్రి సమయంలో తినకూడదు అని చెప్పేవారట. ఈ విషయాన్ని సమంత స్నేహితురాలు ఓ సందర్భంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా హీరోయిన్‌ సమంత మరియు అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: