కమెడియన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ప్రియదర్శి. ఆ తర్వాత హీరోగా మారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. కమెడియన్ గా సినీ ఇండస్ట్రీకి వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందులో ప్రియదర్శి కాస్త స్పెషల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మల్లేశం సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇటీవల బలగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియదర్శి తాజాగా డార్లింగ్ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను

 పలకరించడు. ఇక ఈ సినిమాతో హీరోగా ఆయనకు మంచి కెరియర్ సెట్ అయింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే డార్లింగ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన హీరోగా మరో సినిమా తీస్తున్నట్లుగా సమాచారం వినబడుతుంది. అంతేకాదు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు కూడా రెడీగా ఉందట. ఇక ఆ సినిమా కోసం ఆయన ఒక ఫేమస్ కంటెంట్ క్రియేటర్ హీరోయిన్గా మార్చబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె మరెవరో కాదు నిహారిక ఎన్ఎం. అయితే అమెరికాలో

 చదువుకుంటున్న సమయంలోనే మంచి వీడియోలు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించింది. మేజర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, కేజిఎఫ్ రిలీజ్ టైంలో యష్ సహా పలువురు పెద్ద హీరోలతో కలిసి ఆ సినిమాలను ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య ఆమె పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. అప్పుడే ఆమె ఏదో సినిమా చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా ఏమిటనేది క్లారిటీ వచ్చింది. ప్రియదర్శి హీరోగా నిహారిక హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: