త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న  హీరో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’.  జన‌తా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో ఈ సినిమా రానుండ‌టంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్‌అలీఖాన్ విల‌న్‌ పాత్రలో కనిపించనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని

 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఫ‌స్ట్ సింగిల్ ఫియర్‌ సాంగ్ విడుద‌ల చేయ‌గా.. యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను ఆగ‌ష్టు 05న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా తార‌క్, జాన్వీల‌ది

 రొమాంటిక్ పోస్ట‌ర్ ఒక‌టి వ‌దిలారు. అయితే తాజాగా మళ్లీ ఈ రొమాంటిక్ సాంగ్ కి సంబంధించిన చిన్న మ్యూజిక్ బీట్ ను విడుదల చేశారు చిత్ర బృందం. పదాలు తగ్గినప్పుడు సంగీతమే మాట్లాడుతుంది అన్న హెయిర్ స్టైల్ తో విడుదల చేసిన ఈ చిన్న బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక అనేకమంది స్టార్ నటీనటులు భాగమవుతున్న ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఆచార్య ఎఫెక్ట్తో ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాని కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణతో కలిసి కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: