పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ముఖ్యంగా అభిమానులకి ఫీస్ట్ ఇచ్చే సినిమాలా రాబోతున్న పక్కా హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి  బయటకు వచ్చింది. ఇక ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది రాజా సాబ్' మొదటి సింగిల్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ నిరంతరం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని పాటలు కూడా అంతే హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మ్యూసిక్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సినిమాలోని  మొదటి సింగిల్ రిలీజ్ డేట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సింగిల్ కు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఘనంగానే జరగనున్నట్లు సమాచారం. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సింగిల్ త్వరలోనే విడుదల కానుండడంతో ఫ్యాన్స్ ఆనందం ముద్దులు పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి

  దర్శకుడు థమన్ సగీతాన్ని అందిస్తున్న  సంగతి తెలిసిందే. మరి తను ఈ సినిమా మొదటి పాట వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేసాడు. అయితే రాజా సాబ్ పాట వినాలి అంటే మరో ఐదు నెలలు ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ది రాజా సాబ్" చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ విడుదల తర్వాత మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: